Garla: వ్యవసాయ బావుల్లో పూడికతీత చేపట్టాలని గార్ల ఎంపీడీవోకు సిపిఐ వినతి!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో వ్యవసాయ బావుల్లో ఉపాధి హామీ కింద పూడికతీత చేపట్టాలని కోరుతూ సిపిఐ నాయకులు ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు.
Garla: వ్యవసాయ బావుల్లో పూడికతీత చేపట్టాలని గార్ల ఎంపీడీవోకు సిపిఐ వినతి!
మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలంలో ఈ రోజు వ్యవసాయ బావుల్లో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు చేపట్టాలని కోరుతూ ప్రజావాణిలో ఎంపీడీవో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ... మండలంలోని అనేక బావులు పూడికతో నిండి నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయాయని అన్నారు. రైతులు సొంత ఖర్చులతో పూడిక తీయలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపడితే రైతులకు సాగునీరు అందడంతో పాటు, కూలీలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. వెంటనే ప్రతిపాదనలు పంపి పనులు ప్రారంభించాలని ఎంపీడీవో కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు రాగం రమేష్, మెదరమెట్ల గిరిప్రసాద్, భూక్య హరి నాయక్, ధూపాటి జనార్ధన్, లావుడియా భీముడు తదితరులు పాల్గొన్నారు.




