Jangaon: జనగాం మండలం చిటకోడూరులో రైతులకు పత్తి సాగు ఇన్‌పుట్స్ పంపిణీ!
Jangaon: జనగాం మండలం చిటకోడూరులో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా రైతులకు పత్తి సాగు ఇన్‌పుట్స్‌ను సర్పంచ్ యాదగిరి పంపిణీ చేశారు.
Jangaon: జనగాం మండలం చిటకోడూరులో రైతులకు పత్తి సాగు ఇన్‌పుట్స్ పంపిణీ!
Jangaon: జనగాం మండలం చిటకోడూరు గ్రామంలోని రైతు వేదికలో గ్రామ సర్పంచ్ శ్రీ కూకట్ల యాదగిరి గారి ఆధ్వర్యంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (Mission for Cotton Productivity – MCP) కార్యక్రమంలో భాగంగా రైతులకు పత్తి పంట సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ గిరిరాజు అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ, పత్తి సాగులో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు (Integrated Crop Management – ICM) మరియు దగ్గర దగ్గరగా మొక్కల వరుసల పద్ధతి (Closer Spacing – CS) పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.
పత్తి పంటలో సమతుల్య పోషక యాజమాన్యం, చీడపీడలు మరియు తెగుళ్ల నివారణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యం వంటి అంశాలను సమర్థవంతంగా పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటను పెంచడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చని వివరించారు. అలాగే దగ్గరగా మొక్కలు నాటడం ద్వారా ఎకరాకు అధిక మొక్కల సంఖ్యను సాధించడం, ఎక్కువ కాయలు పొందడం, పత్తి నాణ్యతను మెరుగుపరచడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలపై అవగాహన కల్పించారు.
MCP కార్యక్రమంలో భాగంగా రైతులకు పత్తి పంటకు అవసరమైన Flonicamid 50% WG, Azadirachtin 0.15% EC, Multi K 13:00:45 (Water Soluble), Mepiquat Chloride 5% మరియు Chlorantraniliprole 18.5% SC + Lambda-cyhalothrin 5% EC వంటి ఇన్‌పుట్స్‌ను 15 రైతులకు అందజేశారు. వీటిని వ్యవసాయ శాఖ సూచించిన సాంకేతిక మార్గదర్శకాలు, సిఫారసు చేసిన మోతాదుల మేరకు మాత్రమే వినియోగించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ కూకట్ల యాదగిరి గారు, పాలకవర్గ సభ్యులు, గ్రామ సెక్రెటరీ గారు మరియు రైతులు పాల్గొన్నారు.




