Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ బీఆర్‌ఎస్‌లో చేరికలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి రెడ్యానాయక్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ బీఆర్‌ఎస్‌లో చేరికలు!
Mahabubabad: నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది కార్యకర్తలు మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చకే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను వంచించిందని ఆరోపించారు. గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.




