Bhupalpally: కాంగ్రెస్ ధర్నా - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్!

Bhupalpally: ఓటు చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నిరసన.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 28 Sept 2026 12:03 PM IST
Bhupalpally
X

Bhupalpally: కాంగ్రెస్ ధర్నా - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్!

Bhupalpally: ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బిజెపి ప్రభుత్వంతో ఎలక్షన్ అధికారి జ్ఞానేష్ కుమార్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడ్డారని, వెంటనే అతన్ని అరెస్టు చేసి శిక్షించాలని mla గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

ఓటు చోరీ అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలంటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు,ఈ నిరసన కార్యక్రమం లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఓట్లను కొల్లగొట్టి బీజేపీ అధికారం లోకి వచ్చిందని mla గండ్ర విమర్శలు చేశారు. పేపర్ లీకేజీ తో ఇప్పుడు ఓట్ల చోరీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేశ్వర్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally