Kuravi: కురవి ఆలయానికి కుటుంబ సమేతంగా కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర!

Kuravi: మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం నుంచి కురవి వీరభద్రస్వామి ఆలయం వరకు కాంగ్రెస్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాదయాత్ర నిర్వహించారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 21 Sept 2026 6:19 PM IST
Kuravi
X

Kuravi: కురవి ఆలయానికి కుటుంబ సమేతంగా కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర!

Kuravi: మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం నుంచి కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వరకు కాంగ్రెస్ జిల్లా నాయకులు నూకల అభినవ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

కురవి ఆలయం వద్దకు చేరుకున్న నూకల అభినవ్ రెడ్డి కుటుంబానికి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. పాదయాత్రలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కలిసి నడిచారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో నాయకులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL