Palakurthi: రాంలీలా మైదానంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Palakurthi: ఢిల్లీ రాంలీలా మైదానంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహించిన భారీ నిరసనలో సీఎం, మంత్రులతో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 1 Nov 2026 5:00 PM IST
Palakurthi
X

Palakurthi: రాంలీలా మైదానంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ వ్యతిరేక కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు తావులేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రజల తీర్పే ప్రజాస్వామ్యానికి పునాది అని, ఆ తీర్పును గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ, రాజ్యాంగ విలువల బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాంలీలా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తో పాటు పాలకుర్తి నియోజకవర్గ నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI