Mahabubabad: యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలి.. కలెక్టర్!

Mahabubabad: ఎల్ నినో ప్రభావంతో యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ రైతులకు పిలుపునిచ్చారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 22 Nov 2026 11:54 AM IST
Mahabubabad
X

Mahabubabad: యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలి.. కలెక్టర్!

Mahabubabad: ఎల్ నినో ప్రభావంతో యాసంగిలో తక్కువ నీరు అవసరమైన ఆరుతడి పంటలను వేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ రైతులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సొసైటీ లు,

ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని, విద్యుత్ శాఖ అధికారులు కూడా గ్రామాల్లో రైతులను అవగాహన పరుస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి తావు లేదని, తొర్రూరు లో అవినీతికి పాల్పడిన వార్డు ఆఫీసర్ ను సస్పెండ్ చేశామన్నారు.

జిల్లా లో వి.బి.జీ రామ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నామని, గత సంవత్సరం లో 47 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులు జరుగగా, ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లోనే 37 కోట్ల రూపాయల పనులను చేపించామని, నీటి గుంటలు, ఫామ్ ఫాండ్స్ ను నిర్మింప చేస్తున్నామని తెలిపారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD