Warangal: సీకేఎం కళాశాలలో స్పూర్తి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్!

Warangal: వరంగల్ సీకేఎం కళాశాలలో నిర్వహించిన 'స్పూర్తి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 Nov 2026 8:47 AM IST
Warangal
X

Warangal: సీకేఎం కళాశాలలో స్పూర్తి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్!

Warangal: వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో శనివారం నిర్వహించిన స్పూర్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బీసీ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పుష్పలత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల, హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. హాస్టల్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కళాశాలలో ఫిర్యాదుల పెట్టె (కంప్లైంట్ బాక్స్) ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రస్తుతం స్టూడెంట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ హాస్టల్‌ను బీసీ విద్యార్థినుల సంఖ్య అధికంగా ఉన్నందున, హాస్టల్‌ను కమిషనర్ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు (టేకోవర్‌ చేసేందుకు) ప్రతిపాదనలు రూపొందించి సంబంధిత శాఖకు పంపించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన కలెక్టర్.. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

హాస్టల్ విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేసి, వారికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కళాశాల అధ్యాపకులు హాస్టల్ విద్యార్థుల బాధ్యతను తీసుకొని వారి బాగోగులను పర్యవేక్షించాలని తెలిపారు.

విద్యార్థినులు పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలవాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య, అసోసియేట్ ప్రొఫెసర్ వరప్రసాద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.