Jangaon: విద్యార్థులకు స్వయంగా ఇంగ్లీష్ గ్రామర్ బోధించిన సందీప్ కుమార్ ఝా!

Jangaon: జనగామ జిల్లా లింగాల ఘనపురం మోడల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ బోధన, కట్టెల పొయ్యి వాడకంపై ఆగ్రహం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 22 Sept 2026 1:28 PM IST
Jangaon
X

Jangaon: విద్యార్థులకు స్వయంగా ఇంగ్లీష్ గ్రామర్ బోధించిన సందీప్ కుమార్ ఝా!

Jangaon: జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని మోడల్ పాఠశాల & జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, జూనియర్ కళాశాలలోని తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

మొదట ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ మొదటి, రెండో సంవత్సరం తరగతి గదులను సందర్శించి, పర్యవేక్షించారు.

అలాగే 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. అకాడమిక్ ఫ్రేమ్‌వర్క్ లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్‌పై విద్యార్థులను ప్రశ్నించారు. “What is homework?”, “Homework is what?” అనే రెండు వాక్యాల్లో ఏది సరైనది అని అడిగి, సరైన వాక్యం “What is homework?” అని వివరించారు.

అలాగే “Homework is a noun(నామవాచకం), pronoun(సర్వనామం), adjective(విశేషణం) or verb(క్రియ)?” అని ప్రశ్నించగా, విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం “What is noun(నామవాచకం)?” అని అడగగా, విద్యార్థులు “Name of a person, place, thing etc. (Noun (నామవాచకం) అంటే వ్యక్తి, స్థలం, వస్తువు, జంతువు (లేదా) భావానికి పేరు తెలిపే పదం)” అని సమాధానం చెప్పారు. “Verb అంటే ఏమిటి?” అని ప్రశ్నించగా, విద్యార్థులు “Any action is a verb. (Verb (క్రియ) అంటే పని, చర్య (లేదా) స్థితిని తెలిపే పదం)” అని సమాధానం ఇచ్చారు.

ఏ వాక్యమూ why(ఎందుకు), what(ఏమిటి) వంటి ప్రశ్నార్థక పదాలతో ముగియకూడదని, సరైన వాక్య నిర్మాణం ఎలా ఉండాలో విద్యార్థులకు తానే స్వయంగా కలెక్టర్ అర్థమయ్యేలా వివరించి, ఇంగ్లీష్ గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలను బోధించారు. అనంతరం 10వ తరగతిని సందర్శించి, ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) బోధన తీరును పరిశీలించారు.

పాఠశాలలో అదనపు తరగతి గదుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయురాలికి సూచించారు. అదే విధంగా వంటశాలను పరిశీలించిన కలెక్టర్, కట్టెల పొయ్యిపై వంట చేయడాన్ని గమనించి, అసహనం వ్యక్తం చేశారు. గ్యాస్‌పై మాత్రమే వంట చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ పరిశీలనలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON