Warangal: ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం అమలుపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష!

Warangal: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) అమలు, బోర్ల తవ్వకాల అనుమతుల దరఖాస్తులపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో సమీక్షించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 Nov 2026 8:45 AM IST
Warangal
X

Warangal: ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం అమలుపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష!

Warangal: జిల్లాలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) అమలుకు సంబంధించి చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు.

జిల్లా కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) నిఖిల, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వాత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్ తదితర అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

రైతులు బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమీక్ష లో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి,జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నారాయణ రెడ్డి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.