Seerolu: సీరోలులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Seerolu: సీరోలు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 8 Nov 2026 6:06 PM IST
Seerolu
X

Seerolu: సీరోలులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

సీరోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సీరోలు మండల కేంద్రంలోని సీరోలు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గవిని వెంకన్న, ఉపాధ్యక్షులు గంగాధర్, శ్రీనివాస్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కొండపల్లి కర్ణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్య కార్యకర్తలు శ్యామల మోహన్ రెడ్డి, శ్యామల సత్యం, నాయిని అనిల్ రెడ్డి, మక్కల వీరన్న, అడిగా రాజు, ఆలేటి రవి, ఈర్ల వెంకటమల్లి, దికొండ రమేష్, జనగాం సత్యనారాయణ, పధిర వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL