Warangal: ఢిల్లీ నిరసనకు వెళ్తున్న సీజేపీ నేతల అక్రమ అరెస్ట్ సిగ్గుచేటు

Warangal: ఢిల్లీలో శాంతియుత నిరసనకు వెళ్తున్న సీజేపీ నేతలను మధ్యప్రదేశ్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వరంగల్ సీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 10 Oct 2026 6:42 PM IST
Warangal
X

Warangal: ఢిల్లీ నిరసనకు వెళ్తున్న సీజేపీ నేతల అక్రమ అరెస్ట్ సిగ్గుచేటు

వరంగల్: రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఢిల్లీలో శాంతియుత నిరసన తెలిపేందుకు వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయించడం సిగ్గుచేటని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు మండిపడ్డారు. SIR ప్రక్రియలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఢిల్లీలో సీజేపీ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ నుంచి పలువురు సీజేపీ నేతలు ఢిల్లీకి వెళుతుండగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతంలో పోలీసులు తమను అడ్డుకొని అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు అరెస్ట్ పేరుతో తిప్పి, తిరిగి పోలీసుల మధ్య బందీలుగా వారి ప్రాంతాలకు పంపించారని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కుతో నిరసన తెలుపడం తప్పు కాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే దేశంలో మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని, ఎన్ని నిర్బంధాలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ రాజీనామా చేసేంత వరకు సీజేపీ ఉద్యమం ఆగదని ఇన్ ఖు లాఫ్ జిందాబాద్, భారత్ మాతాకీ జై, జై భీమ్ జై సంవిధాన్, జీనా హై తో మర్నా సికో ఖదం ఖదం పర్ మర్ నా సికో అనే నినాదాలు చేస్తూ, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఈ ప్రెస్ మీట్ లో సీజేపీ నాయకులు స్టోన్లి కోరాని సౌత్ జోన్ కోఆర్డినేటర్, రాజేష్ కొరపాక, రంగ సాయి రెడ్డి స్టేట్ మెంబర్స్,శ్రీనిథ, గ్యారీ మాథ్యూస్, తరుణ్ ,భరత్, ప్రజ్వల్ నివాస్, సునీల్ వరంగల్ సీజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST