Bhupalpally: పేరులేని గొత్తికోయ గూడానికి భీమ్ జి నగర్‌గా నామకరణం చేసిన సీఐ!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి శివారులోని పేరులేని గొత్తికోయ గూడానికి సీఐ శ్రీనివాస్ భీమ్ జి నగర్‌గా నామకరణం చేశారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 21 Nov 2026 11:24 AM IST
Bhupalpally
X

Bhupalpally: పేరులేని గొత్తికోయ గూడానికి భీమ్ జి నగర్‌గా నామకరణం చేసిన సీఐ!

Bhupalpally: భూపాలపల్లి మండలం దూదేకులపల్లి శివారులోని గొత్తికోయ గూడాన్ని భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గూడంలోని గొత్తికోయ కుటుంబాలను కలిసి వారి జీవన స్థితిగతులు, జీవన విధానం, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి దైనందిన జీవితం, నివాస పరిస్థితులు, ఇతర ఇబ్బందుల గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా గొత్తికోయలు తమ గూడానికి ఇప్పటివరకు ఎలాంటి పేరు లేదని, గూడానికి ఒక ప్రత్యేక పేరు పెట్టాలని సీఐ శ్రీనివాస్‌ను కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఐ.. ఆ గూడానికి భీమ్ జి నగర్ గా పేరు పెట్టారు. దీంతో గొత్తికోయలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు

సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గూడంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, అనుమానాస్పద వ్యక్తుల సంచారం కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే దిశగా పోలీసుల ఈ పర్యటన కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పవన్, శ్రావణ్, గీత, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally