Channagudur: చిన్నగూడూరులో వార్డు మెంబర్ల నిరసన!

Channagudur: చిన్నగూడూరు మండలంలో వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల బిల్లుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన.

P PRABHAKAR, DORNAKAL
Published on: 7 Oct 2026 1:17 PM IST
Channagudur
X

Channagudur: చిన్నగూడూరులో వార్డు మెంబర్ల నిరసన!

Channagudur: ప్రజాధనంతో నిర్వహించిన వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల బిల్లుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వార్డు మెంబర్లు బుధవారం చిన్నగూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ.. శిక్షణ తరగతుల నిర్వహణలో వాస్తవంగా జరిగిన ఖర్చులకు మించి బిల్లులు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పత్రాల్లో వెల్లడైందని తెలిపారు. శిక్షణ సమయంలో స్థానికంగానే వంటలు నిర్వహించి భోజనాలు అందించారని, సమోసాలు తదితర అల్పాహారాలు తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అశోక హోటల్ పేరుతో బిల్లులు చూపించడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.

అలాగే స్కేలు, పెన్సిళ్లు, పెన్నులు తదితర సామగ్రి ఎవరికీ అందించలేదని, వాటికి కూడా బిల్లులు ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా పొందిన పత్రాల్లో వెల్లడైందని తెలిపారు. జయ్యారం గ్రామంలోని రైతు వేదికలో శిక్షణ తరగతులు నిర్వహించగా, అక్కడ ఇప్పటికే సౌండ్ సిస్టమ్, కుర్చీలు తదితర సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటికి కూడా బిల్లులు చూపించినట్లు పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు.

ప్రజాధనానికి సంబంధించిన బిల్లులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, అవకతవకలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL