Kuravi: కురవిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Kuravi: కురవి మండలంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆమె చిత్రపటానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జటోత్ రామచంద్రనాయక్ నివాళులర్పించారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 26 Sept 2026 7:29 PM IST
Kuravi
X

Kuravi: కురవిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Kuravi: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కురవి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యుడు గొల్లపల్లి రజనీకాంత్, మండల ఉపాధ్యక్షుడు దొంగల జనార్దన్ రెడ్డి, అయ్యగారిపల్లి సర్పంచ్ జక్కుల మాధవి–నాగన్న, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చెన్నూరు వెంకన్నతో పాటు సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL