Jangaon: లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండ.. ఎమ్మెల్యే హరీశ్ రావు!
Jangaon: జనగామ జిల్లాలో మృతి చెందిన ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Jangaon: లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండ.. ఎమ్మెల్యే హరీశ్ రావు!
Jangaon: జనగామ ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
హరీశ్ రావు మీడియా పాయింట్స్ తమ్ముడు లక్ష్మణ్ గౌడ్ మృతి అత్యంత బాధాకరం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నేను, పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాం.
లక్ష్మణ్ గౌడ్ కొనుగోలు చేసిన జేసీబీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మైనింగ్ కేసులో సీజ్ చేసి నెలల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచారు. భారీ పెనాల్టీలతో జేసీబీ విడిపించుకోలేక అప్పుల భారం పెరిగింది.
సొంత 7 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వానాకాలం పంట వేశారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా కొన్నే చెరువుకు నీరు రాలేదు. విద్యుత్ లేక, బోరు విఫలమై పంట ఎండిపోయి పెట్టుబడి నష్టపోయారు.
60-70 ఏళ్లుగా వారసత్వంగా అనుభవిస్తున్న భూమి ధరణి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా, మరో వ్యక్తి దరఖాస్తుతో కొత్త కలెక్టర్ దానిని ప్రొహిబిషన్ జాబితాలో చేర్చారు. దీంతో అప్పులు తీర్చేందుకు భూమి అమ్ముకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
బీఆర్ఎస్ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరుడికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
లక్ష్మణ్ గౌడ్ భార్యకు మంచి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కుటుంబాన్ని ఆదుకుంటాం.
లక్ష్మణ్ గౌడ్ మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. ఆయనను కోల్పోవడం కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే ఉంది.
ఒక వ్యక్తి మృతిలో కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో విమర్శలు చేయడం సరికాదు.




