Jangaon: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊరుకోం: బీఆర్‌ఎస్!

Jangaon: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని బీఆర్‌ఎస్ ఫైర్. దమ్ముంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నేతల సవాల్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Sept 2026 7:42 PM IST
Jangaon
X

Jangaon: పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊరుకోం: బీఆర్‌ఎస్!

జనగామ: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిపై ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని మార్కెట్ మాజీ చైర్మన్ సిద్ది లింగం అన్నారు.

శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ సందర్బంగా సిద్ది లింగం మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచి పేరున్న నాయకుడని, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు.

రైతులు, యువకులు తమ సమస్యలపై నిరసనలు తెలిపేందుకు వెళ్తే వారిని పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి పనులు చేయించాలనే చిత్తశుద్ధి ఉంటే సంబం ధిత మంత్రులతో మాట్లాడి పనులు చేయించుకోవాలని సూచించారు.

సీతక్క జనగామకు వచ్చి రూ.17 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెబుతున్నారని, అసలు ఎక్కడ, ఏఏ పనులకు ఎంత నిధులు ఖర్చు చేశారో పూర్తి నివేదికను ప్రజల ముందు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జనగామలో రోడ్ల విస్తరణ, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, బతుకమ్మ కుంట తదితర అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిపై ఆరోపణల్లో నిజం ఉంటే ధైర్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. జనగామ నియోజకవర్గంలో పల్లా రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని, విద్యా, వైద్య రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

అనవసర విమర్శలు మానుకుని ప్రజాసేవపై దృష్టి పెట్టాలి, బీఆర్‌ఎస్ హయాంలో జనగామలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, జనగామ మున్సిపాలిటీకి ఐదేళ్లలో మూడు ప్రభుత్వ అవార్డులు, రూ.17 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై నివేదిక విడుదల చేయాలి.

మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పోకల జామున

కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేయకుండా ప్రజాసేవలో ముందుండి ప్రజలకు న్యాయం చేయాలని మున్సిపల్ మాజీ చైర్‌ పర్సన్ పోకల జామున సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఉపయో గపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జనగామలో అనేక అభివృద్ధి కార్యక్ర మాలు జరిగాయని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ, డివైడర్ల ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు, చెట్ల పెంపకం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధా మాలు వంటి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ తీసుకురావడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

జనగామ మున్సిపాలిటీకి గత ఐదేళ్లలో ఒక కేంద్ర ప్రభుత్వ అవార్డు, రెండు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయని ఆమె గుర్తు చేసారు. ఈ అవార్డులు పాలకవర్గం, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజల సహకారంతో సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తీసుకొచ్చిన CT స్కాన్ యంత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సీతక్క జనగామకు వచ్చి రూ.17 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశామని చెబుతున్నారని, ఆ నిధులతో చేపట్టిన పనులు ఏమిటో, ఎక్కడ ఎంత ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే ప్రారంభించి పేద వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

గ్రామకంఠం భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

50, 60 ఏళ్లుగా ఉన్న ఇళ్లను 22Aలో పెట్టడంతో ప్రజలకు ఇబ్బందులు, ఇళ్లపై రుణాలు, రిజిస్ట్రేషన్లకు అవరోధాలు ఏర్పడుతున్నాయి, అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టడం సరికాదు

బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి

1954 నుంచి గ్రామకంఠం పరిధిలో ఉన్న భూములు, ఇళ్లకు సంబంధిం చి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి కోరారు. గ్రామకంఠం కింద ఉన్న ప్రైవేట్ ఇళ్లకు సాధారణంగా సర్వే నంబర్లు ఉండవని, అలాంటి ఇళ్లను ప్రస్తుతం నిషేధిత జాబితా (22A)లో చేర్చడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని అన్నారు.

50, 60 ఏళ్లుగా ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లను 22A జాబితాలో చేర్చడంతో ఆయా ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని తెలిపారు. సొంత అవసరాల కోసం ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవ డానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామకంఠం భూములకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలించి, ప్రజలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్ల విషయంలో ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

గ్రామకంఠం భూములు, 22A నిషేధిత జాబితాకు సంబంధించిన పూర్తి విషయ పరిజ్ఞానం, స్పష్టత లేకుండా కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం సరికాదని విమర్శించారు. ముందుగా సమస్యపై పూర్తి అవగాహన కల్పించుకుని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కారం చూపేందుకు కృషి చేయాలని సూచించారు.

అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదు

2014 నుంచి జనగామలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, స్ట్రీట్ లైట్లు, డివైడర్లతో అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి సేవలు.

బీఆర్‌ఎస్ నాయకురాలు అనిత

జనగామ అభివృద్ధిపై అవగాహన లేకుండా డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడటం సరికాదనీ బీఆర్‌ఎస్ నాయకురాలు అనిత అన్నారు. నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

2014 నుంచి జనగామలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. జనగామ కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, స్ట్రీట్ లైట్లు, డివైడర్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు విద్యా, వైద్య రంగాల్లో స్వశక్తితో సేవలు అందిస్తూ ప్రజలకు వివిధ సందర్భాల్లో అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి సహాయం చేయడంలో ఆయన ముందుంటారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని అనిత అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు జనగామ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, కౌన్సిలర్ లు ఉడుగుల కిష్టయ్య, సెవెళ్ల మధు సూదన్, పానుగంటి సువార్త, ఏనుగుందుల అనూష కిష్ణ, సందుపట్ల మంజుల, మాజీ కౌన్సిలర్ లు ముస్త్యాల దయాకర్, ఉల్లెంగుల నర్సింగ్ , నాయకులు మామిడాల రాజు, దామెర రాజు, రామకృష్ణ, గుర్రం నాగరాజు, ఉల్లెంగుల సందీప్, కొమ్మురాజు, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON