Hanamkonda: హనుమకొండలో ఘనంగా ప్రజాకవి కాళోజీ వర్ధంతి వేడుకలు

Hanamkonda: హనుమకొండ బాలసముద్రం బీఆర్ఎస్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 4:42 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో ఘనంగా ప్రజాకవి కాళోజీ వర్ధంతి వేడుకలు

హనుమకొండ: బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం నందు శుక్రవారం రోజున కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళోజీ నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర, ఆయన తెలుగు ప్రాముఖ్యతను వివరించిన తీరు అమోఘమని, ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు.

ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలను చైతన్య పరచారని కొనియాడారు తుది శ్వాస వరకు కూడా సమాజ శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు.

కేసీఆర్ గారు కాళోజీ నారాయణరావు పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఉడుతల సారంగపాణి, మేకల బాబు రావు, నాయకులు ఇమ్మడి రాజు, చిన్న, మూటిక రాజు, అభిలాష్, కోటేశ్వర్, మహేందర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్