Hanumakonda: ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన!
Hanumakonda: హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ఫాం-18 అందజేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి.
Hanumakonda: ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన!
Hanumakonda: ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించడంలో భాగంగా మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఫాం 18 అందజేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు అవ్వాలని పిలుపునిచ్చారు.
మార్నింగ్ వాక్ లో భాగంగా నగర్ వాసులను, ఉద్యోగులను, పోలీస్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను కలవడం జరిగింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు పట్టభద్రుడు సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.
సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎన్కం భిన్నమైనదని, సమాజానికి మార్గదర్శకంగా నిలిచే పట్టబద్రులు వేసే ఓటు కాబట్టి ప్రతి పట్టభద్రుడు తమ విలువైన ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.




