Warangal: వరంగల్ తూర్పులో బీఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం!

Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 4 Oct 2026 6:34 PM IST
Warangal
X

Warangal: వరంగల్ తూర్పులో బీఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం!

Warangal: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకున్న వారిపై, పట్టభద్రుల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే విభిన్నమైనవని, ప్రభుత్వ లోపాలను గుర్తించి ఓటేయడం విద్యావంతుల బాధ్యత అన్నారు.

నిరుద్యోగులు, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, మెగా డీఎస్సీ, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పట్టభద్రులంతా బీఆర్ఎస్ వైపే చూస్తుండటంతో కాంగ్రెస్ లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ నియోజకవర్గంలో ఓటరు నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ రాకేష్ రెడ్డిని గెలిపించి చట్టసభలకు పంపడం ద్వారా పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ గెలుపు కేసీఆర్ నాయకత్వానికి పునాది అవుతుందని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వరంగల్ తూర్పులో అత్యధిక ఓటర్లను నమోదు చేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST