Bhupalpally: తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ కీలక ఘట్టం!
Bhupalpally: తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్‌కు ప్రత్యేక స్థానం ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, గండ్ర జ్యోతి అన్నారు.
Bhupalpally: తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ కీలక ఘట్టం!
Bhupalpally: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్‌కు ప్రత్యేక స్థానం ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఆదివారం భూపాలపల్లి పట్టణంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తొలుత భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.అదే విధంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ ఫొటో గ్యాలరీని నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఉద్యమ సమయంలో జరిగిన కీలక ఘట్టాలు, కేసీఆర్ నిరాహార దీక్ష, తెలంగాణ సాధన కోసం సాగిన పోరాటాలను ఫొటోల ద్వారా గుర్తు చేసుకున్నారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా మాజీ zp చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందని, అహింసాయుత ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షను చేపట్టి తెలంగాణా రాష్ట్రాన్ని తేవడమే కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణం లో కూడా కీలక పాత్ర వహించినట్లు తెలిపారు... తెలంగాణా సమాజం కేసీఆర్ పాలనను మర్చిపోదన్నారు.




