Hanamkonda: భీమదేవరపల్లి పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం!
Hanamkonda: భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని సర్పంచ్ మాచర్ల కుమారస్వామి ప్రారంభించారు.
Hanamkonda: భీమదేవరపల్లి పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం!
Hanamkonda: ఈరోజు భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని సర్పంచ్ మాచర్ల కుమారస్వామి గారు ప్రారంభించారు.
విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, చదువుపై ఏకాగ్రత పెంపొందించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా సర్పంచ్ ఆకాంక్షించారు.
విద్యార్థుల ఆరోగ్యమే – గ్రామ భవిష్యత్తుకు పునాది!
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి గారు,వేణుగోపాల్ గారు ఉపసర్పంచ్ శనిగరం ఐలయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మాచర్ల లక్ష్మి, వార్డు సభ్యులు సంధ్య , శ్రీనివాసరెడ్డి, శ్యామ్ ,వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




