Hanamkonda: చిలువేరు ఇమ్మానియేలుకు బీజేపీ శ్రేణుల ఘన నివాళి!

Hanamkonda: దామెర మండల బీజేపీ సీనియర్ నేత చిలువేరు ఇమ్మానియేలు మృతి పార్థివ దేహంపై పార్టీ జెండా కప్పి బీజేపీ నేతల నివాళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, అండగా ఉంటామని భరోసా.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Sept 2026 9:23 PM IST
Hanamkonda
X

Hanamkonda: చిలువేరు ఇమ్మానియేలుకు బీజేపీ శ్రేణుల ఘన నివాళి!

హనుమకొండ: హనుమకొండ జిల్లా.. దామెర, సెప్టెంబర్ 29: భారతీయ జనతా పార్టీ దామెర మండల సీనియర్ నాయకులు చిలువేరు ఇమ్మానియేలు మృతి పట్ల బీజేపీ మండల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన ఇమ్మానియేలు పార్థివ దేహంపై బీజేపీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, బీజేపీ బలోపేతం కోసం ఇమ్మానియేలు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన మృతి పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం ఇమ్మానియేలు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో బీజేపీ కుటుంబం వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాం ఫౌండేషన్ చైర్మన్ గురజాల శ్రీరామ్ రెడ్డి, ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు ఇర్సుడ్ల సదానందం, దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, ప్రజా సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ మాదాసు సురేష్, మండల ప్రధాన కార్యదర్శి సూర చందర్, మండల ఉపాధ్యక్షులు సిలువేరు చంద్ర కిరణ్, బీజేవైఎం మండల నాయకులు కొత్తపల్లి శివ, బూత్ అధ్యక్షులు సిలువేరు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL