Palakurthy: పాలకుర్తిలో ఉద్రిక్తత.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్!
Palakurthy: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యేతో బహిరంగ చర్చకు తలపెట్టిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
Palakurthy: పాలకుర్తిలో ఉద్రిక్తత.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్!
Palakurthy: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరుప్పుల మండల కేంద్రంలో జరిగిన పత్రికల సమావేశంలో చేసిన ఆరోపణలో బీజేపీ రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు అని మాట్లాడిన విషయంపై భాజాపా నాయకులు తలపెట్టిన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే తో బహిరంగ చర్చ జరుగ కుండా భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించటం జరిగింది.
అరెస్ట్ అయిన వారిలో భాజపా సీనియర్ నాయకులు దొంగరి మహేందర్, పాలకుర్తి మండల అధ్యక్షులు మారం రవికుమార్,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, పెనుగొండ సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.




