Gudur: గూడూరులో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

B NARASIMHA, GUDUR
Published on: 28 Nov 2026 12:48 PM IST
Gudur
X

Gudur: గూడూరులో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం!

Gudur: గూడూరు (hmtv)భారతీయ జనతా పార్టీ గూడూరు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన అంశాలు చర్చకు రావడం, బిల్లుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల నేపథ్యంలో గూడూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేరెడ్డి సురేందర్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రాజకీయ రంగంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ అంశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ నిర్ణయాత్మక ప్రక్రియలో కూడా వారికి తగిన అవకాశాలు కల్పించడం అవసరమని అన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగడానికి ఇటువంటి చర్యలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ దేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యానికి సంబంధించిన కీలకమైన అంశమని, ఈ ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలు, అన్ని ప్రాంతాల ప్రయోజనాలు, సమతుల్య ప్రాతినిధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మేరెడ్డి సురేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల,జిల్లా నాయకులు చెల్పూరి వెంకన్న,గుండెబోయిన మల్లేష్,సర్పంచ్ గుండెల వీరన్న, ఉపసర్పంచ్ సాయి కుమార్ మెరుగు మల్లయ్య, సమ్మెట సుధాకర్,పడాల నాగరాజు,ముత్యం సురేష్,కొమ్మలు నాయక్,

వంకుడోత్ శ్రీనివాస్,గుగులోత్ దేవేందర్, ముదురుకోలా శ్రీనివాస్, సతీష్, కొయ్యది అనిల్,యశ్వంత్, శివ, రాజు, సంపత్, రాంబాబు,వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR