Parkal: పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!
Parkal: ప్రధాని మోదీ, హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు.
Parkal: పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!
Parkal: భారత ప్రధాని నరేంద్ర మోదీపై, హిందూ దేవతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల బస్టాండ్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా గాజుల నిరంజన్ మాట్లాడుతూ, దేశ ప్రధానిపై రాజకీయ విమర్శలు చేయడం ఒక విషయం, కానీ కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరాముడు, పరమశివుడి వంటి దేవతలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలకు స్థానం ఉందని, అయితే హిందూ దేవతలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా మార్చడం సమంజసం కాదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉంటుందని, ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ సంయమనం పాటించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీపై విమర్శలు చేస్తే బీజేపీ రాజకీయంగా సమాధానం చెబుతుంది, కానీ హిందూ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే హిందూ సమాజం మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల కౌన్సిలర్స్ కుక్కల విజయ్ కుమార్,ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి,
మాజీ అధ్యక్షులు మార్త బిక్షపతి, కానుగుల గోపీనాథ్, కార్యదర్శి దారుణ సునీల్, కుమార్ ఆకుల రాంబాబు OBC మండల అధ్యక్షులు పైండ్ల రంజిత్ కుమార్, BJYM నాయకులు కక్కురాజు, కొలనుపాక రేవంత్ సిద్దు, బూత్ అధ్యక్షులు పిట్ట కిషోర్, దామ సతీష్, కాగితపు చంద్రమోహన్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.




