Bhupalpally: భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ దీక్షలు!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
Bhupalpally: భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ దీక్షలు!
భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో వివిధ విభాగాలకు చెందిన కార్మికులు, ఫిట్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్ ఈ దీక్షలను ప్రారంభించారు. KTK OC-3 అండర్‌గ్రౌండ్ పిట్ సెక్రటరీ ఎల్. శంకర్, KTK-6 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రేడ్స్‌మెన్ ఇన్‌చార్జి రవి తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు 60 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు బకాయిలు పేరుకుపోయేలా వ్యవహరించడం సరికాదన్నారు.
అదేవిధంగా 2026 ఆగస్టు 27న జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించాలని, 1981 జనవరి 29న ఏఐటీయూసీతో జరిగిన ఒప్పందం ప్రకారం అర్హులైన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా వీవీటీసీ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు నెల రోజుల్లోనే ఆర్డర్లు జారీ చేయాలని కోరారు.




