Bhupalpally: భూపాలపల్లిలో పోలీస్ ఉద్యోగాలకు 75 రోజుల ఉచిత శిక్షణ ప్రారంభం!

Bhupalpally: భూపాలపల్లిలో పోలీస్ ఉద్యోగాల కోసం 75 రోజుల ఉచిత శిక్షణ ప్రారంభం. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చేతుల మీదుగా శిక్షణా తరగతులు ప్రారంభం.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 18 Sept 2026 5:19 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లిలో పోలీస్ ఉద్యోగాలకు 75 రోజుల ఉచిత శిక్షణ ప్రారంభం!

భూపాలపల్లి: పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి జిల్లా యువతకు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 75 రోజుల ఉచిత డేస్ స్కాలర్ శిక్షణ తరగతులు శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు.

పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న జిల్లా యువతకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందుతూ తమ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా యువత పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో నాణ్యమైన శిక్షణ అందించేందుకు 75 రోజుల ఉచిత డేస్ స్కాలర్ కోచింగ్‌ను ప్రారంభించామని తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించడం ద్వారా యువతకు మంచి భవిష్యత్తుతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా, సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు.

క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ 75 రోజుల శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది యువత పోలీస్ ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు, భూపాలపల్లి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally