Bhupalpally: కలెక్టర్ రాహుల్ శర్మకు ఆయిల్ ఫాం రైతుల వినతిపత్రం

Bhupalpally: భూపాలపల్లి కలెక్టరేట్ ప్రజావాణిలో విద్యుత్ వైర్ల సమస్యపై ఆయిల్ ఫాం రైతులు కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం సమర్పించి శాశ్వత పరిష్కారం కోరారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 16 Nov 2026 5:42 PM IST
Bhupalpally
X

Bhupalpally: కలెక్టర్ రాహుల్ శర్మకు ఆయిల్ ఫాం రైతుల వినతిపత్రం

భూపాలపల్లి: ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ వైర్ల సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందనీ ఆయిల్ ఫాం రైతులు తెలిపారు... ప్రభుత్వాలు ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు అందించడంతో అనేక మంది రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే పెరుగుతున్న ఆయిల్ ఫాం చెట్లు విద్యుత్ వైర్లకు అడ్డుగా మారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఆయిల్ ఫాం రైతులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి ప్రజావాణిలో వినతిపత్రం అందించారు.

ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ పథకం ద్వారా రైతులకు సబ్సిడీలు అందిస్తోందనీ. దీంతో జిల్లాలో పలువురు రైతులు ఆయిల్ ఫాం సాగును చేపడుతున్నట్లు తెలిపారు..అయితే ఆయిల్ ఫాం చెట్లు 20 నుంచి 25 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుండగా.. వాటి మీదుగా సుమారు 15 అడుగుల ఎత్తులో విద్యుత్ వైర్లు ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు.

విద్యుత్ స్తంభాలకు, వైర్లకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో విద్యుత్ శాఖ అధికారులు ఆయిల్ ఫాం చెట్లను నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి చెట్లను నరికివేస్తే తిరిగి అవి సాగుకు పనికిరాకుండా పోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పంటను విద్యుత్ వైర్ల సమస్యతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి, ఆయిల్ ఫాం రైతులకు నష్టం కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజావాణిలో వినతిపత్రం అందించారు

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally