Bhupalpally: కరువు మండలాల ప్రకటనలో వివక్ష చూపించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర
Bhupalpally: భూపాలపల్లిలో కరువు మండలాల ప్రకటనపై వివక్షను తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి.
Bhupalpally: కరువు మండలాల ప్రకటనలో వివక్ష చూపించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని,ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వస్తే పోలీసులను అడ్డుపెట్టి సభకు రాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ నల్ల టీషర్టు ధరించి పార్లమెంట్‌కు వెళ్లవచ్చు.. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఆ హక్కు లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయం, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీకి మరో న్యాయమా..? అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలను ఏకపక్షంగా నిర్వహిస్తూ ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులకు ప్రకృతి కారణమైనప్పటికీ, ప్రభుత్వ నిర్ణయాలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించడంలో, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రస్తుత శాసన సభ సభ్యుడిని నాగారం గ్రామంలో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు కావాలని కోరితే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంటలు పండించుకోవాలనుకునే రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు.
భూపాలపల్లి జిల్లాలో కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం అనుసరించిన విధానంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.




