Bhupalpally: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం, జయశంకర్ పార్క్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 23 Nov 2026 9:48 AM IST
Bhupalpally
X

Bhupalpally: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్!

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం, జయశంకర్ పార్క్‌లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ రామస్వామి నాయక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అంబేద్కర్ స్టేడియం, జయశంకర్ పార్క్‌లో ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారిని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి కొద్దిసేపు వాకింగ్ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించారు. అక్కడి నుంచి స్టేడియంలోని జిమ్‌కు చేరుకొని వ్యాయామం చేస్తున్న యువతతో ముచ్చటిస్తూ వారితో కలిసి కాసేపు వ్యాయామం చేశారు.

అనంతరం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి వారి సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను వారికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు . కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఇక మిగిలింది కేవలం 500 రోజులు మాత్రమేనని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాలని పిలుపునిచ్చారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally