Bhupalpally: భూపాలపల్లి కేటీపీపీ వద్ద ఉద్రిక్తత పోలీసులతో బీఆర్ఎస్ నేతల తోపులాట!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీపీపీ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'చలో చెల్పూర్' ఉద్రిక్తం.. పోలీసులతో తోపులాట, కేటీపీపీని సందర్శించిన మాజీ మంత్రులు.
Bhupalpally: భూపాలపల్లి కేటీపీపీ వద్ద ఉద్రిక్తత పోలీసులతో బీఆర్ఎస్ నేతల తోపులాట!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ktpp వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో చెల్పూర్ కేటీపీపీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీపీపీకి తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి శంకర్ నాయక్, అరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు కేటీపీపీ వైపు వెళ్లకుండా పోలీసులు మొదటి గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నాయకులు, కార్యకర్తలు మొదటి గేటును దాటుకుంటూ ముందుకు వెళ్లారు. అనంతరం రెండో గేటు వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
అనంతరం brs ముఖ్య నాయకులను లోనికి అనుమతించగా మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి శంకర్ నాయక్, అరూరి రమేష్ తదితరులు ktppని సందర్శించి విద్యుత్ ఉత్పత్తి ఎంత మేరకు జరుగుతుంది బొగ్గు నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు .జెన్ కో సిఈనీ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు
రైతులకు వెంటనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీపీపీ వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది




