Mahabubabad: కొత్తగూడెంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ వాలీబాల్ టోర్నీ ఘనం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో వాలీబాల్ టోర్నీ ఘనంగా జరిగింది. పూనెం శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు.
Mahabubabad: కొత్తగూడెంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ వాలీబాల్ టోర్నీ ఘనం!
Mahabubabad: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీలో గత 25 సంవత్సరాల నుండి దసరా పండగ సందర్భంగా క్రీడలు నిర్వహించేవారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ముఖ్య అతిథిగా
రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ చైర్మన్, ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ నాయకుడు పూనెం శ్రీనివాస్ పాల్గొని ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ...
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులకు, నిర్వాహకులకు, గ్రామ యువతకు నా హృదయపూర్వక అభినందనలు.
ఈ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు. గెలిచినవారు మరిన్ని విజయాలు సాధించాలి. ఓడిపోయినవారు నిరుత్సాహపడకుండా, వచ్చే పోటీల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి,క్రీడలు మనకు క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల, సోదరభావాన్ని నేర్పిస్తాయి.
మన ఆదివాసీ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రీడల్లోనూ విద్యలోనూ ఉన్నత స్థాయికి ఎదగాలి ,గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు మనమందరం కృషి చేయాలి,ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఆదివాసీ యువతలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, మన సమాజ అభివృద్ధికి దోహదపడతాయి.
అలాగే ఇదే ఐకట్టతో మన హక్కుల సాధన కోసం మన రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా ఉద్యమించి మన ఏజెన్సీ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఒకవేళ అదే జరగకపోతే మన ప్రాంతంలో మనని బతకనిచ్చే పరిస్తితి
లేదు కాబట్టి మనం రక్షించుకోవడానికి మనం తప్పనిసరిగా ఆటలతో పాటు సాంస్కృతిని సాంప్రదాయాలని మన మన కాపాడుకోవడమే కాకుండా మన రాజకీయ రిజర్వేషన్ ని మన ఉద్యోగ రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నదని అన్నారు, బహుమతుల దాతలు..
1)పూనెం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు & చైర్మన్ ASP TG, AJAC TG 15000 మరియు సీల్డ్ ..
2) మెస్సు, రఘువర్మ 12000 మరియు సీల్డ్
3) కొత్తగూడెం సర్పంచ్ కోర్సా సుమలత నరేష్ 10,000 , సీల్డ్
4) నామాలపాడు సర్పంచ్..వర్సా దీప ప్రకాష్.8,000 మరియు సీల్డ్
ఈ యొక్క కార్యక్రమంలో వర్ష ప్రకాష్ జిల్లా కార్యదర్శి ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా
కోర్సా సుమలత నరేష్ సర్పంచ్ కొత్తగూడెం గ్రామపంచాయతీ పూనెం మంగయ్య మెస్ రఘువర్మ, పూనెం రవి అరెం కిచందర్, ఈసం రాధాకృష్ణ (లవ్లీ) చింత వినోద్ వట్టం రాజేష్ అరెం బాబు వట్టం నారాయణ ఈసాల సంజీవరావు మాడే మహేష్ ఊకె రాకేష్ మరియు గ్రామ పెద్దలు యువత మహిళలు మొదలగువారు పాల్గొన్నారు.




