Bayyaram: బయ్యారంలో హాస్టళ్ల తనిఖీ: విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని పోస్ట్‌మెట్రిక్ బాలుర హాస్టల్, ఇరుసులాపురం ఆశ్రమ పాఠశాలను స్పెషల్ ఆఫీసర్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Bayyaram: బయ్యారంలో హాస్టళ్ల తనిఖీ: విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి,స్పెషల్ ఆఫీసర్ రాజు ఈరోజు హాస్టళ్ల తనిఖీలో భాగంగా పోస్ట్‌మెట్రిక్ బాలుర వసతి గృహాన్ని,ఇరుసులాపురం గ్రామంలోని ఆశ్రమ పాఠశాల సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... ..వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు, విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్య, విద్యా వాతావరణం , ఇతర సౌకర్యాలపై వివరాలను తెలుసుకోవడం జరిగింది.
ఇరుసులాపురం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి, వారి విద్యా ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలు మరియు విద్యాపరమైన అంశాలపై చర్చించడం జరిగింది.
ఆదర్శ వ్యక్తుల జీవిత విశేషాలు, వారి విజయ గాథలు, కష్టపడి సాధించిన విజయాలు గురించి విద్యార్థులకు వివరించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించడం జరిగింది.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించడం జరిగింది.




