Bayyaram: రేషన్ కార్డు లేకున్నా రూ.5 లక్షల బీమా భరోసా
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో నవంబర్ 20 నుంచి రూ.5 లక్షల బీమా పథకం దరఖాస్తులు స్వీకరిస్తారు. రేషన్ కార్డు లేని వారూ అర్హులేనని అధికారులు తెలిపారు.
Bayyaram: రేషన్ కార్డు లేకున్నా రూ.5 లక్షల బీమా భరోసా
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లోని ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ సర్పంచులకు ఇన్చార్జి ఎంపీడీవో అధ్యక్షతన బయ్యారం,జగ్గుతండా, కొత్తపేట గ్రామ పంచాయతీల్లో ఈనెల 20వ తారీకు నుండి రూ,5 లక్షల బీమా భరోసా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..
కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు.ఈ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదని, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబ పెద్దలకు బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ నెల 20వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన వ్యక్తి అనుకోకుండా మరణించినప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.రేషన్ కార్డు లేని అర్హులైన కుటుంబాలు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అర్హులైన ప్రతి కుటుంబం పథకం వివరాలను తెలుసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.




