Bayyaram: బయ్యారంలో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

Bayyaram: బయ్యారంలో జేఏసీ చైర్మన్ వర్స ప్రకాష్ దొర ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి. జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో ఆదివాసీల హక్కులు కాపాడాలని పిలుపు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 22 Oct 2026 4:19 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో వర్స ప్రకాష్ దొర బయ్యారం మండలం JAC చైర్మన్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా JAC చైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ...వాసీ హక్కుల కోసం పోరాడి, గిరిజన సమాజంలో చైతన్యం నింపిన మహనీయుడు కొమరం భీమ్ అని అన్నారు. కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకొని ఆదివాసీ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివాసీల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కొమరం భీమ్ ఆశయమైన “జల్, జంగల్, జమీన్” స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆదివాసీ యువత విద్య, ఉద్యోగాలు, సామాజిక అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఆదివాసీ సమాజ ఐక్యతను బలోపేతం చేస్తూ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆదివాసీ హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం సంఘటితంగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బొల్లి వెంకట కృష్ణ,మెస్సు రాజశేఖర్ దొర ,కొట్టెం పుల్లయ్య ,ఇర్ప రామారావు, వట్టం శ్రీను,సిద్దబోయిన జయసుధ, కొట్టెం శాంత,పర్షిక రమ,తాటి అమల, వెంకటేష్ (పండు) చింత నందు , చాట్ల పాపారావు, మూతి రాజశేఖర్, మెస్సు కృష్ణ,ఆదివాసీ ఉద్యోగస్తులు, నాయకులు, యువత, మహిళలు, ఆదివాసీ సమాజ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM