Bayyaram: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 19 Nov 2026 4:34 PM IST
Bayyaram
X

Bayyaram: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి,కిషన్ నాయక్ , పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ...భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అని దేశ సమగ్రత సమైక్యత,అభివృద్ధి కోసం, తన జీవితాన్ని అంకితం చేసిన, మహోన్నత నాయకురాలు, ఇందిరా గాంధీ గారి జీవితం, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు నేటి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం...

పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం*గరీబి హటావో, పంచవర్ష పణాళికలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి ఎన్నో సాహోసోపెత నిర్ణయాలు తీసుకున్న మహాను భారాలు అని,ఆమె చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

ఆ మహనీయురాలి ఆశయాలను స్మరించుకుంటూ, ఆమె చూపిన సేవా మార్గంలో సమాజ అభ్యున్నతికి కృషి చేద్దాం. ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో బయ్యారం మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య యాదవ్, ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా రంజిత్, బయ్యారం మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, కిసాన్ సెల్ జిల్లా ప్రధానకార్యాదర్శి పెద్దీని వెంకటేశ్వర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తగిర సత్తిరెడ్డి, సుద్దపల్లి నారాయణ రెడ్డి వార్డు సభ్యులు, శీలం సరోజన, బానోత్ అజయ్, పెద్దిని శాంత, నందగిరి భద్రయ్య,మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలులు మండ రేణుక, నందిపాటి బవాణి,రామగిరి వెంకటేశ్వర్లు,కొండ్రేడ్డి ప్రమోద్, ఆర్మీ సతీష్, ఏనుగుల రంజిత్, పందిరి విద్యాసాగర్, సంజీవ,తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM