Bayyaram: ఇల్లందు దీక్షా దివస్ విజయవంతం చేయాలి
Bayyaram: ఇల్లందులో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బయ్యారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాతా గణేష్ పిలుపునిచ్చారు.
Bayyaram: ఇల్లందు దీక్షా దివస్ విజయవంతం చేయాలి
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాతా గణేష్ మాట్లాడుతూ ...ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి భానోతు హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు రేపు ఇల్లందు BRS పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజేత చేయాలని కోరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మన రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చారిత్రాత్మక రోజనిఅన్నారు.




