Bayyaram: వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

Bayyaram: వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలి, రోజుకు రూ.800 వేతనం ఇవ్వాలి: బయ్యారంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండా రాజన్న

NARASIMHARAO, BAYYARAM
Published on: 23 Oct 2026 5:19 PM IST
Bayyaram
X

Bayyaram: వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు స్థానిక వే జెల్ల సైదులు రావు భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం బల్లెం ఆనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండా రాజన్న ,మండల కార్యదర్శి వల్లాల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తించినప్పటికీ నేటికీఆ రంగం అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు చట్టాలు చేయడంలో చిన్న చూపే చూస్తుందని వారు ఎద్దేవా చేశారు.

కావున వ్యవసాయ రంగాన్ని గుర్తించి వ్యవసాయ కూలీలకు సమగ్రమైన, శాశ్వతమైన చట్టాన్ని అమలు చేసి కార్మికులందరికీ ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఉపాధి హామీ కార్మికులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని , కేంద్రం పథకాల పేరు మార్చడమే కాదు నిధులు కేటాయించడంలో దృష్టి కేంద్రీకరించాలని హెచ్చరించారు.

మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు కేటాయించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు .తక్షణమే ప్రతి కార్మికుని కి 200 పని దినాలు, రోజుకు 800 రూపాయలు కొలతలతో సంబంధం లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నిడికొండ చంటి, మడూరి వెంకటేశ్వర్లు, కత్తి యాదగిరి దాసరి పుల్లయ్య, వెన్ను మోహన్ తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM