Bayyaram: మానుకోట ఆదివాసీ ధర్మయుద్ధ సభ పోస్టర్ ఆవిష్కరణ
Bayyaram: బయ్యారంలో ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ధర్మయుద్ధ సభ పోస్టర్ ఆవిష్కరణ. డిసెంబర్ 9న మానుకోటలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని జేఏసీ పిలుపు.
Bayyaram: మానుకోట ఆదివాసీ ధర్మయుద్ధ సభ పోస్టర్ ఆవిష్కరణ
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ధర్మయుద్ధ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఛలో మానుకోట జోడో యాత్రలో భాగంగా బయ్యారం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
స్థానిక కుల పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకుల సమక్షంలో కోదండరామయ్య ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 9న మానుకోట గడ్డపై నిర్వహించనున్న సాంస్కృతిక ధర్మయుద్ధం బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ 9 తెగల ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలు, జాతి అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించే బహిరంగ సభకు ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ సీనియర్ నాయకులు గొగ్గెల కోటయ్య, పోలేబోయిన రామ నర్సయ్య, మెస్సు రాజశేఖర్ దొర, వట్టం శ్రీనివాస్ ,చాట్ల వెంకన్న దొర, ఇర్పా రామారావు, చుంచు ముత్తయ్య, మాజీ సర్పంచ్ దనసరి కోటమ్మ, పూనెం జయమ్మ, గొగ్గెల రామస్వామి, అడ్వకేట్ సువర్ణపాక సత్యనారాయణ, అడ్వకేట్ వాసం ఆనంద్, పెండేకట్ల యాకయ్య, కల్తి సారయ్య, ఎట్టి కిరణ్, చుంచు రాజు, తాటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెచ్ఎం ధనసరి కోటయ్య, రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వట్టం నారాయణ, చాట్ల అశోక్ , చింత వినోద, వీసం మమత, కొట్టెం శాంత తదితరులు పాల్గొన్నారు.




