Jangaon: జనగామ ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
Jangaon: జనగామ ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు; చైర్మన్ చిట్ల రాజేందర్ రెడ్డి ప్రారంభోత్సవం, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు, అధ్యాపకులు.
Jangaon: జనగామ ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ చిట్ల రాజేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేస్తూ పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా చాటిచెప్పారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఈదులకంటి రాజు, అనిల్, కిషన్, వినయ్, దేవ, కుమార్, రామన్, మధు, కర్ణాకర్, రాజేష్, రవి, అనూష తదితరులు పాల్గొన్నారు.




