Bhupalpally: గణపురం కోటగుళ్లలో 'బబ్లూ XXL' సినిమా షూటింగ్ సందడి
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం కోటగుళ్లలో సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'బబ్లూ XXL' సినిమా షూటింగ్ సందడిగా కొనసాగుతోంది.
Bhupalpally: గణపురం కోటగుళ్లలో 'బబ్లూ XXL' సినిమా షూటింగ్ సందడి
భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జిల్లాలో మరో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఏషియన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో, రాజు వెడ్స్ రాంబాయి చిత్ర దర్శకుడు సాయిలు కాంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బబ్లూ XXL' షూటింగ్ ఘనపురం మండల కేంద్రం లోని చారిత్రక కోటగుళ్ళ లో జరుగుతోంది.
ఈ చిత్రంలో హీరోగా సుమంత్ ప్రభాస్ నటిస్తుండగా, హీరోయిన్‌గా మలయాళ నటి ఘాజీ నటిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కోటగుళ్లలో చిత్రీకరిస్తున్నారు.
చారిత్రక నేపథ్యం కలిగిన కోటగుళ్ల అందాలను వెండితెరపై ఆవిష్కరించేలా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ షూటింగ్‌లో ప్రముఖ రైటర్ మిట్టపల్లి సురేందర్ సినిమా యూనిట్ తో ఉండి సన్నివేశాలకు తగ్గట్టు పాటలు రాస్తున్నారు.
ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన గణపురం కోటగుళ్లు సినిమా షూటింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాయి. సినిమా చిత్రీకరణతో భూపాలపల్లి జిల్లా పేరు వెండితెరపై మారుమోగనుంది.




