Parkal: పరకాల పోలీస్ స్టేషన్‌లో వైభవంగా విజయదశమి ఆయుధ పూజలు!

Parkal: పరకాల పోలీస్ స్టేషన్‌లో ఎస్ హెచ్ ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ, వాహన పూజలు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి.

M PRABHAKAR, PARAKAL
Published on: 20 Oct 2026 1:41 PM IST
Parkal
X

Parkal: పరకాల పోలీస్ స్టేషన్‌లో వైభవంగా విజయదశమి ఆయుధ పూజలు!

Parkal: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల పోలీస్ స్టేషన్ లో సోమవారం ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్ హెచ్ ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయుధ పూజ చేశారు. వాహనాలకు, ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ దుష్టశక్తులపై దేవతల విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారన్నారు. పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL