Atmakur: టిప్పర్ బ్యాటరీల దొంగను అరెస్ట్ చేసిన ఆత్మకూర్ పోలీసులు!
Atmakur: ఆత్మకూర్ పోలీసులు గూడేపహాడ్ జంక్షన్ వద్ద టిప్పర్ బ్యాటరీల దొంగ పస్తం ఐలుకుమార్‌ను అరెస్ట్ చేసి, రూ.20 వేల విలువైన రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.
Atmakur: టిప్పర్ బ్యాటరీల దొంగను అరెస్ట్ చేసిన ఆత్మకూర్ పోలీసులు!
ఆత్మకూర్: ఆత్మకూర్ టిప్పర్ బ్యాటరీల దొంగను ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం, నిన్న గూడేపహాడ్ జంక్షన్‌లోని రాజరాజేశ్వరి పంక్చర్ షాప్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు పస్తం ఐలుకుమార్ (35), తండ్రి నర్సయ్య, కాశీబుగ్గ, వరంగల్ గా గుర్తించారు. అతని వద్ద నుంచి రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.20 వేలు.
జూలై నెలలో గూడేపహాడ్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెగొండ మండలానికి చెందిన మేకల భాస్కర్ రెడ్డి టిప్పర్ వాహనంలోని రెండు బ్యాటరీలను దొంగిలించినట్లు విచారణలో తేలింది. నిందితుడిని ఈరోజు పరకాల కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఆపరేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరణ్, మహిళా కానిస్టేబుల్ ప్రవళిక, హోంగార్డు రామన్న పాల్గొన్నారు.




