Mulugu: ములుగు ప్రత్యేక న్యాయస్థానంలో టైపిస్టు పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం!
Mulugu: ప్రత్యేక న్యాయస్థానంలో ఒప్పంద ప్రాతిపదికన ఒక టైపిస్టు పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
Mulugu: ములుగు ప్రత్యేక న్యాయస్థానంలో టైపిస్టు పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం!
Mulugu: ములుగు జిల్లాలో అత్యాచార, పోక్సో చట్టం కేసుల సత్వర విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో ఒప్పంద ప్రాతిపదికన ఒక టైపిస్టు పోస్టును భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టుకు నెలకు రూ.19,500 సమీకృత వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షల్లో ఆంగ్ల టైపురైటింగ్ ఉన్నత శ్రేణి పరీక్ష, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. కంప్యూటర్ నిర్వహణలో పరిజ్ఞానం, అర్హత కలిగి ఉండాలని తెలిపారు.
అభ్యర్థులు 01.10.2026 నాటికి 18 సంవత్సరాలు నిండి, 34 సంవత్సరాలు నిండని వారై ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని తెలిపారు.
టైపింగ్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 20 కంటే ఎక్కువ దరఖాస్తులు అందితే నిబంధనల ప్రకారం అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలకు పిలవనున్నట్లు తెలిపారు.
దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, పుట్టిన తేదీ, వర్తించే సామాజిక వర్గ ధ్రువపత్రం, స్థానికతకు సంబంధించిన ధ్రువపత్రాల ధ్రువీకరించిన ప్రతులను జతచేయాలని సూచించారు. అభ్యర్థి చిరునామా రాసిన కవరును రూ.25 విలువైన తపాలా బిళ్లలతో, తపాలా శాఖ నిర్దేశించిన రిజిస్టర్డ్ పోస్టు రుసుముకు అనుగుణంగా జతపరచాలని పేర్కొన్నారు.
పూర్తిచేసిన దరఖాస్తులను మూసివేసిన కవరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ప్రధాన న్యాయస్థానం, ములుగు చిరునామాకు స్పీడ్ పోస్టు, కొరియర్ ద్వారా పంపించాలని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 22న సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయానికి చేరాలని స్పష్టం చేశారు. నేరుగా, వ్యక్తిగతంగా దరఖాస్తులు స్వీకరించబోమని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్నవి, గడువు తర్వాత అందిన దరఖాస్తులు తిరస్కరిస్తామని తెలిపారు.
పూర్తి నోటిఫికేషన్ వివరాలను "https://districts.ecourts.gov.in/mulugu" (https://districts.ecourts.gov.in/mulugu) వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ఆమె ప్రకటలో తెలిపారు.




