Amanagallu: ఆమనగల్లులో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఆదివారం నిర్వహించే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో అందరూ పాల్గొనాలని గాజుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Amanagallu: ఆమనగల్లులో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ మండలం స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు, పద్మశాలి చేనేతల ఆత్మబంధువు స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం ఆమనగల్లు అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆమనగల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి పద్మశాలి కులబాంధవులు, అన్ని బీసీ కులాల నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, చేనేత కార్మికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గాజుల శ్రీనివాస్ కోరారు.




