Warangal: కొండా మురళి జన్మదిన వేడుకలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ!

Warangal: వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదిన వేడుకలు. శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేసిన శ్రీరామ్ రాజేష్ ఫౌండేషన్.

MD. AMEER, WARANGAL EAST
Published on: 23 Oct 2026 4:23 PM IST
Warangal
X

Warangal: కొండా మురళి జన్మదిన వేడుకలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ!

Warangal: వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, పండ్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ రాజేష్ మాట్లాడుతూ... కొద్ది రోజుల్లో జరగబోయే ఫైనల్ ఎగ్జామ్స్ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు హాల్ టికెట్ పెట్టుకునే పౌచ్‌లను కూడా అందజేస్తానని తెలిపారు.

విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST