Warangal: పత్తికి క్వింటాల్‌కు రూ.12 వేల ధర ఇవ్వాలి.. ఏఐకేఎఫ్ నేత డిమాండ్!
Warangal: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.12,000 కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ (AIKF) అధ్యక్షుడు పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
Warangal: పత్తికి క్వింటాల్‌కు రూ.12 వేల ధర ఇవ్వాలి.. ఏఐకేఎఫ్ నేత డిమాండ్!
Warangal: అంతర్జాతీయ మార్కెట్ లో పత్తికి మంచి డిమాండ్ ఉన్నా, వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ (AIKF) అధ్యక్షుడు పెద్దారపు రమేష్ ఆరోపించారు. క్వింటాల్ పత్తిని కనీసం 12 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో AIKF నాయకులు పర్యటించారు. పత్తి అమ్మకానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా పత్తి దిగుబడి తగ్గిందని, దీంతో ఇక్కడ పండిన పత్తికి మంచి ధర లభించాల్సి ఉందన్నారు.
కానీ మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి క్వింటాల్ పత్తిని 8,000 నుండి 8,500 రూపాయల లోపే కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




