Warangal: 36వ డివిజన్ చింతల్లో సద్దుల బతుకమ్మ, దసరా ఏర్పాట్ల పరిశీలన!
Warangal: వరంగల్ 36వ డివిజన్ చింతల్లో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నాయకుడు ఆడేపు వెంకటేష్. అధికారులకు పలు సూచనలు.
Warangal: 36వ డివిజన్ చింతల్లో సద్దుల బతుకమ్మ, దసరా ఏర్పాట్ల పరిశీలన!
Warangal: 36వ డివిజన్ చింతల్ లో సద్దుల బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల ఏర్పాట్లను సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆడేపు వెంకటేష్.
ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజలందరి సహకారంతో సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మన పండుగలు, మన సంప్రదాయాలు, మన తెలంగాణ సంస్కృతిని చాటేలా ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.




