Warangal: కలెక్టరేట్లో ప్రజావాణి.. ప్రజల నుంచి 213 వినతుల స్వీకరణ!
Warangal: వరంగల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వైవీ గణేష్ హాజరై ప్రజల నుంచి 213 వినతులను స్వీకరించారు.
Warangal: కలెక్టరేట్లో ప్రజావాణి.. ప్రజల నుంచి 213 వినతుల స్వీకరణ!
Warangal: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారి ఆదేశాల మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవి గణేష్ హాజరై ప్రజలనుండి వినతులు స్వీకరించినైనది.
ఈ ప్రజావాణికి మొత్తం 213 దరఖాస్తులు అందాయని, వివిధ శాఖలకు సంబంధించి ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 52 దరఖాస్తులు అందగా, హౌసింగ్ శాఖకు 35, జీడబ్ల్యూఎంసీకి 33, డీఆర్డీఏకు 24 దరఖాస్తులు అందాయి.
అలాగే జిల్లా సంక్షేమ శాఖకు 6, డీసీఎస్ఓకు 4, ఈడీఎస్సీ కార్పొరేషన్‌కు 3, వ్యవసాయ శాఖకు 3, విద్యాశాఖకు 2, డీఎంహెచ్ఓ/ఎంజీఎంకు 2, ఎల్డీఎంకు 2, ఉపాధి శాఖకు 1, పోలీస్ శాఖకు 1 దరఖాస్తు అందాయని పేర్కొన్నారు. ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్యల త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణి డియార్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ వసంత,డి యం అండ్ హెచ్ ఓ రాజి రెడ్డి,హౌసింగ్ పిడి విష్ణు వర్ధన్ రెడ్డి, కలెక్టర్ సూపరిండెంట్ విశ్వప్రసాద్ ,కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రవణ్, డిబిసిడివో పుష్పలత,డిపివో కల్పన,మరియు సంబధిత అధికారుల తో పాటు దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




